ఘనంగా ఆలయ వార్షికోత్సవం
A grand temple anniversary
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: కోల్ బెల్ట్ రామకృష్ణాపూర్ ఏరియా సింగరేణి ఆసుపత్రిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏడో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారి మూల విరాటుకు నెయ్యి, పంచామృతాభిషేకం నిర్వహించి, స్వామి వారికి విశేషపుష్పాలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం హోమం జరిపారు. మందమర్రి డివిజన్ కు బదిలీపై వచ్చిన సింగరేణి ఏరియా జీఎం దేవేందర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివైసీఎంఓ ప్రసన్న కుమార్, కృష్ణ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.