జూలై 27 నీతి ఆయోగ్ సమావేశం

July 27 NITI Aayog meeting

Jul 19, 2024 - 14:49
 0
జూలై 27 నీతి ఆయోగ్ సమావేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్​ తొమ్మిదో సమావేశం జూలై 27న జరిగనుంది. ఈ సమావేశానికి 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు ఆరుగురు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. కాగా ఈ సమావేశానికి హాజరు కావాలని పలువురు ప్రతిపక్ష నాయకులకు కూడా పీఎంవో కార్యాలయం ఆహ్వానం పంపింది. అయితే సమావేశానికి వెళ్లాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మే 2023న నీతి ఆయోగ్​ ఎనిమిదో సమావేశం జరిగింది.