నాలుగువేల యేళ్ల క్రితమే అణుదాడి!
అస్థిపంజరాల ద్వారా స్పష్టం వివరాలు వెల్లడించిన ప్రముఖ శాస్ర్తవేత్త బిల్లీ కార్సన్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: నాలుగువేల సంవత్సరాల క్రితమే అణు యుద్ధం జరిగిందని అందుకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నామని బిల్లీ కార్సన్ అన శాస్ర్తవేత్త వెల్లడించాడు. తాను పాక్ లో పరిశోధన చేస్తుండగా పలు అస్థిపంజరాలను కనుగొన్నానని తెలిపారు. మొహెంజోదారో నాగరికత ప్రదేశాలను కూడా జల్లెడ పట్టినట్లు వివరించారు. ఇందులో అతిపెద్ద రహాస్యం బయటపడిందన్నారు. కనుగొన్న అస్థి పంజరాల ద్వారా అణుదాడి ఆధారాలను కనుగొన్నానని తెలిపారు. ఈ దాడుల్లో రేడియేషన్ ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ అస్థిపంజరాల మరణం వెనుక గ్రహశకలం ఢీకొనడం కూడా ఒక కారణం కావ్చని తెలిపారు. ఇందుకు స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. అయితే అణుదాడి జరిగిందనేదానికి ఆధారాలు సంపాదించానని తెలిపారు. అస్థిపంజరాలకు ఎలాంటి గాయాలు లేవని వీటిలో అణుధార్మికత మూలాకాలను గుర్తించామని బిల్లీ తెలిపారు.