బురద జల్లినా కమలం వికసిస్తుంది 

బీజేపీ విజయానికి విపక్షాల సహకారం మరువలేనిది తమ గెలుపుపై ప్రపంచవ్యాప్తంగా ధీమా టిక్కెట్లు కాదు గెలిచాక ఇచ్చే సర్టిఫికెట్లనే అభ్యర్థులకిచ్చాం వక్రభాష్యాలతో ప్రతిపక్షాల దుర్భుద్ధిని వ్యక్తపరుస్తున్నారు ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని నూరి పోస్తున్నాం భవిష్యత్​ మరిన్ని సవాళ్లకు నెలవు వాటిని ఎదుర్కోనే  ధైర్యాన్నిస్తున్నాం మహిళా సాధికారతతోనే దేశం ప్రథమ స్థానంలోకి ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ

May 16, 2024 - 20:57
 0
బురద జల్లినా కమలం వికసిస్తుంది 

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: కమలంపై ఎంత బురద జల్లాలని చూసినా అంతే వికసిస్తుందన్న విషయాన్ని ప్రతిపక్షాలు నిరూపిస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కమలం వికసిస్తుందన్న సంగతి తనకు ఎప్పుడో తెలుసని? కానీ విపక్షాలు కూడా కమలం వికసించేందుకు తోడ్పాటునందిస్తున్నాయని చమత్కరిస్తూ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఇంకా మూడు దశల్లో ఓటింగ్​ మిగిలే ఉందన్నారు. ఇప్పుడు గెలుపు స్థానాలను సాధించామని ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలే గాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మోదీ, బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారని తెలపడం ఆశ్చర్యకరమన్నారు. తాము ప్రపంచనంతా వసుదైక కుటుంబంగానే భావించామన్నారు. ఇది ముమ్మాటికీ నిజమన్నారు. అందుకే అందరూ కమలం వికసించాలని కోరుకుంటున్నారని తెలిపారు. 

బీజేపీ టిక్కెట్లు లభించిన వారంతా గెలిచే సర్టిఫికెట్లనే అందుకున్నారని భరోసానిచ్చారు. మూడో దశలో గెలుపు గుర్రాలకే నీతి నిజాయితీ అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయించామని మోదీ స్పష్టం చేశారు.

రానున్న సమయంలో వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్​ తప్పక ఉంటుందన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 
బోఫోర్స్ పాపాలు కడిగేందుకే రఫెల్​ సమస్యను లేవనెత్తారని, అదానీ-అంబానీ లాంటి ప్రశ్నలు కాంగ్రెస్ మానసిక స్థితిని ప్రజలముందు వ్యక్తపరుస్తున్నారని అన్నారు. తామేమో దేశ భవిష్యత్​, కీర్తి, ప్రతిష్ఠలను ఇనుమడింప చేయాలన్న ఆలోచనలో ఉంటే కాంగ్రెస్​, కూటమి పార్టీలు దేశ భవిష్యత్​ ను మంటగలిగే చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాక భారత్​ లోని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రజలకు ధైర్యం నూరి పోయాల్సింది పోయి వారికి అడుగడుగునా పిరికితనం, భయాన్ని నేర్పిస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం భారత్​ లోని ప్రతీవ్యక్తికి సాధించగలరన్న నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు. దీనివల్ల తమ పదేళ్ల హాయాంలో దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో స్వయంగా ప్రపంచం చూస్తుందన్నారు. 

జీ–20లో పలువురు దేశాధ్యక్షులు తనతో సంభాషిస్తూ భారత్​ కు మోదీ శ్రేయస్కరమని విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. భారత్​ విశ్వసనీయత, నమ్మకాన్ని ఒక్క తనలోనే చూశాయని వారు వివరించారన్నారు. తాను అప్పుడు కూడా వారికి ఒక్కటే మాట చెప్పానని, ఏ దేశంలోనైనా నీతి, నిజాయితీ, నమ్మకం, విశ్వాసంతో పనిచేసిన పార్టీకి ప్రజాస్వామ్యంలో తిరుగులేదని తెలిపానన్నారు. ఇది తన విజయం కాదని ప్రజాస్వామ్య విజయమని వారికి వివరించానని మోదీ పేర్కొన్నట్లు తెలిపారు.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దేశం మీద అభిమానం ఉన్న ప్రతీ ఒక్కరూ కమలం వికసించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. వారందరికీ తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. 

దేశ ప్రజలు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా రూపొందించాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. భవిష్యత్​ లో మరిన్ని సవాళ్లకు ప్రపంచం నెలవుగా మారబోతోందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటి నుంచే ఆ పరిణితిని సాధించగలిగితే భారత్​ మనుగడ మరో వెయ్యేళ్ల వరకూ ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగుతుందని మోదీ తెలిపారు.

దేశంలోని ఎక్కడి ప్రజలతోనైనా ఇట్టే కలిసిపోయే గుణం ఆ దేశ ప్రధానికి ఉండాల్సిన తొలి లక్షణంగా తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆ స్థానిక అంశాలపై, స్థానిక ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, వారి ఈతిబాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. బహుశా అందుకే ప్రజలు తనను అంతగా అభిమానిస్తూ ఉండవచ్చని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు భారత్​ లో మరింత ఎదగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వారి ఎదుగుదలో భారత్​ సంపూర్ణ సాధికారతతో బాటు అభివృద్ధి దిశలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.