బీజాపూర్ లో ఎన్ కౌంటర్ ముగ్గురు నక్సల్స్ మృతి
Three naxals killed in encounter in Bijapur
రాయ్ పూర్: బీజాపూర్ లో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఆదివారం వేకువజాము నుంచి జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు నక్సల్స్ మృతిచెందారు. నక్సలైట్ల నుంచి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ పట్నంలోని మద్దెడ్ ప్రాంతంలో బందేపరాకొరంజెడ్ అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కూంబింగ్ కొనసాగుతుందని పూర్తయ్యాక వివరాలను వెల్లడిస్తామని భద్రతాధికారులు తెలిపారు. భద్రత బలగాలను అటవీ ప్రాంతాంలో భారీ కూంబింగ్ కు ఉపక్రమించడం పట్ల మరిన్ని ఎన్ కౌంటర్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.