వక్ఫ్ సవరణ.. పార్లమెంట్ లో జేపీసీ సమావేశం
Waqf amendment.. JPC meeting in Parliament
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు–2024పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో సమావేశమైంది. గురువారం బిల్లుకు సంబంధించిన సవరణలపై సుధీర్ఘ చర్చలు జరపనున్నారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీలో 31 మంది సభ్యులు ఉన్నారు.
లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉన్నారు. బిల్లును పరిశీలించేందుకు లోక్‌సభ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు ముసాయిదా చట్టంలో ప్రతిపాదించిన సవరణలపై చర్చిస్తున్నారు.
కమిటీ మొత్తం 44 సవరణలపై చర్చిస్తుందని రానున్న పార్లమెంట్ సమావేశాల వరకు సమగ్ర చట్టం తీసుకువస్తామని జగదాంబికా పాల్ చెప్పారు.