తొలి విడత పోటీలో 219మంది

23.27 లక్షల మంది ఓటర్లు 5.66 యువ ఓటర్లు సెప్టెంబర్ 18న తొలిదశ ఎన్నికలు

Aug 31, 2024 - 13:31
 0
తొలి విడత పోటీలో 219మంది
శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ తొలి విడత ఎన్నికల్లో 219 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. 24 అసెంబ్లీ స్థానాలకు తొలిదశ సెప్టెంబర్​ 18న పోలింగ్​ జరగనుంది. మొత్తం 280 నామినేషన్​ లు దాఖలయ్యాయి. 25 ఉపసంహరణ, 35 తిరస్కరణ తరువాత 219 మంది పోటీలో నిలిచారు. 
 
ఇందర్వాల్​ –9 మంది పోటీలో ఉండగా, పద్దర్​ నాగసేని 6, భదర్వా 10, దోడా 9, దోడా వెస్ట్​ 8, రాంబన్​ 8, బనిహాల్​ 7, పాంపోర్​ 14, త్రాల్​ 9, పుల్వామా 12, రాజ్​ పోరా 10, జైన్​ పోరా 10, పోషియాన్​ 11 మంది, పోరా 6, కుల్గామ్​ 10, డియోసర్​ 9, దురు 10, అనంత్​ నాగ్​ పశ్చిమ 9, అనంత్​ నాగ్​ 13, బిజ్​ బెహరా 3, షాంగాస్​ 13, పహల్గామ్​ లో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 
తొలివిడతలో జరగనున్న ఎన్నికల్లో 23.27 లక్షల మంది ఓటర్లుండగా, 11.76 మంది పురుషులు, 11.51 మహిళలు, 5.66 లక్షల మంది యువ, 60మంది థర్డ్​ జెండర్​ ఓటర్లున్నారు.