కేరళలో ప్రభుత్వ సహకారంతో కమ్యునిష్టు గూండాల అరాచకాలు ప్రధాని మోదీ
అసమర్థ ప్రభుత్వాల వల్ల కేరళ వాసులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
తిరువనంతపురం: అసమర్థ ప్రభుత్వాల వల్ల కేరళ వాసులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చట్టం నిర్లక్ష్యం, కమ్యూనిస్టు గుండాల అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల వల్ల కేరళకు ఉపయోగం ఏమీ లేదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, తెలంగాణ నుంచి ప్రారంభించారు. ఉదయం10 గంటలకు కేరళలో పతనంతిట్టా పర్యటనలో భాగంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేరళలో కమలం వికసించనుందన్నారు. బీజేపీ ఇక్కడి యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు కళ్లు మూసుకున్నాయన్నారు. కమ్యునిస్టు గుండాల అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. దీంతో చర్చిల ఫాదర్లు కూడా భయపడిపోతున్నారన్నారు. కాంగ్రెస్, ఎల్డీఎఫ్ లను ఓడిస్తేనే మీకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల దమన నీతిని కేరళ ప్రజలు విద్యావంతులు అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో వారికి బుద్ధి చెప్పాలని, బీజేపీ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. కేరళలో కేంద్రం చేపట్టిన పనులు అనేకం ఉన్నాయని కేవలం ఈ రోజు పర్యటిస్తున్న పతనంతిట్టా జిల్లాలో 3లక్షలపై చిలుకు కుటుంబాలకు జల్జీవన్కనెక్షన్ లు ఇచ్చామన్నారు. ఐదు లక్షల మందికి ఉచిత రేషన్లభిస్తుందన్నారు.1.50 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్నిధి కింద రూ.380 కోట్లు ఇచ్చామన్నారు.