పంజాబ్​లో కలుషిత మద్యం సేవించి 21 మంది మృతి, చికిత్స పొందుతున్న 40 మంది

విచారణకు సిట్​ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Mar 23, 2024 - 16:46
 0
పంజాబ్​లో కలుషిత మద్యం సేవించి 21 మంది మృతి, చికిత్స పొందుతున్న 40 మంది

చండీగఢ్: పంజాబ్​లో కలుషిత మద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్య పెరిగింది. శనివారానికి మృతిచెందిన వారి సంఖ్య 21గా పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు 40మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్​ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్​ను ఏర్పాటు చేసింది. సంగ్రూర్​ వైద్యాధికారి మీడియాతో మాట్లాడుతూ.. మందులో ఇథనాల్​ కలిపారని స్పష్టం చేశారు. బుధవారం కూడా ఇలాగే నలుగురు వ్యక్తులు మృతిచెందారని పేర్కొన్నారు. శుక్రవారం ఎనిమిది మంది మృతిచెందారని తెలిపారు. కలుషిత మద్యం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆసుపత్రికి వచ్చే కేసుల్లో మరణాలు సంభవించడం దురదృష్టకరమన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కలుషిత మద్యం తయారీకి వినియోగిస్తున్న ఇంట్లో 200 లీటర్ల ఇథనాల్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్​ డీఐజీ హరిచరణ్​సింగ్​ భుల్లర్​ స్పష్టం చేశారు.