బోరుబావిలో బాలిక మృతి
The doctors announced that the girl had died in the borewell for ten days
జైపూర్: రాజస్థాన్ లోని కోట్ పుట్లీలో బోర్ బావిలో పడిపోయిన చిన్నారి చేత్నా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 10 రోజుల తరువాత బాలికను వెలికి తీయగా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. డిసెంబర్ 23న చేత్నా (7) ఆడుకుంటూ 700 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం బాలికను కాపాడేందుకు పెద్దఎత్తున రంగంలోకి దిగి గత పదిరోజులుగా నిద్రాహారాలు మాని ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు నెరవేరలేదు. బుధవారం చేత్నాను అధికారులు బయటకు తీసిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. చేత్నా 170 అడుగుల లోతులో ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. అక్కడి నుంచి చేసిన ప్రయత్నాల వల్ల 120 అడుగులకు తీసుకురాగలిగారు. పాపను బయటికి తీసే క్రమంలో అనేక అవాంతరాలు, సవాళ్లు ఎదురయ్యాయి. చివరకు బాలిక మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.