జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు 10మంది మృతి
30మందికి తీవ్ర గాయాలు
వాషింగ్టన్: అమెరికా 2025 సంవత్సరం తొలిరోజు ఘోరం జరిగిపోయింది. బుధవారం న్యూ ఓర్లీన్స్ లూసియానాలోని బోర్బన్ స్ర్టీట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో వేగంగా వచ్చిన ట్రక్కు జనాలపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది మృతిచెందగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న పికప్ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కాల్పులు జరిపినట్లుగా స్థానికులు పోలీసులకు తెలిపారు. ప్రజలంతా ఒకచోట గూమికూడి నూతన సంవత్సర వేడుకలు జరుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఇటీవలే జర్మనీ వేడుకల్లో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఓ కారు అత్యంత వేగంగా జనాలపైకి దూసుకువెళ్లింది.