7.3 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
GST collections increased by 7.3 percent
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గడిచిన సంవత్సరం 2024 జీఎస్టీ వసూళ్లలో 7.3 శాతం పెరిగి 1.77 లక్షల కోట్లకు చేరుకుంది. 2023కు సంబంధించిన జీఎస్టీ 2024 జనవరి కాలంలో ఇదే సమయానికి రూ. 1.65 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ ఆదాయం 8.4 శాతం పెరిగి 1.32 లక్షల కోట్లకు చేరుకుంది. బుధవారం ఆర్థిక శాఖ జీఎస్టీ గణాంకాల ప్రకటనను విడుదల చేసింది. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) వసూళ్లు రూ.32,836 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.40,499 కోట్లు, రిజిస్టర్డ్ ఐజీఎస్టీ రూ.47,783 కోట్లు, సెస్ రూ.11,471 కోట్లు.