11మంది నక్సలైట్ల లొంగుబాటు
Surrender of 11 Naxalites
ముంబాయి: పదకొండు మంది నక్సలైట్లు గడ్చిరోలిలో మహారాష్ట్ర ఈఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. బుధవారం గడ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తారక్క సిదాం అనే నక్సలైట్ సహా 11మంది లొంగిపోయారు నక్సలైట్లు జనజీవ స్రవంతిలో కలవడం హర్షణీయమని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. దీంతో రాష్ట్రం త్వరలోనే నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో నక్సలైట్ల ప్రభావం తగ్గితే అభివృద్ధికి పునాదులు వేసేందుకు మరింత అవకాశం లభిస్తుందన్నారు. గడ్చిరోలి మహారాష్ర్ట సరిహద్దు చివరి జిల్లా.