మాజీ ప్రధాని డా.మన్మోహన్ స్మారక స్థలం ఎంపిక
Former Prime Minister Dr. Manmohan's memorial site selection
కుటుంబానిదే తుది నిర్ణయం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని డా. మన్మోహర్ సింగ్ స్మారకాన్ని నిర్మించే ప్రక్రియ ప్రారంభమైంది. రాజ ఘాట్, నేషనల్ మెమోరియల్, కిసాన్ ఘాట్ సమీపంలో పలు స్థలాలను ఎంపిక చేసింది. స్థల ఎంపిక నిర్ణయాన్ని తీసుకోవాలని మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని బుధవారం అధికారులు కోరారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖాధికారులు ఆయా స్థలాల వివరాలను కేంద్రానికి అందజేశారు. స్థలాన్ని కుటుంబ సభ్యులు ఎంపిక చేసుకున్నాక ట్రస్ట్ ను ఏర్పాటు చేయనున్నారు. ట్రస్ట్ స్థలం కేటాయింపునకు ఆమోదముద్ర వేశాక నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అయితే తొలి ప్రధానుల స్మారకస్థలాలకు దగ్గరగా డా.మన్మోహన్ సింగ్ కు 1, 1.5 ఎకరాల స్థలం కేటాయించే అవకాశం ఉంది.