రియాసీ దాడులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన సహాయకుడి అరెస్ట్
Arrest of aide who sheltered terrorists in Riyasi attacks
శ్రీనగర్: రియాసీ దాడుల్లో ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన స్లీపర్ సెల్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బుధవారం రియాసీ జిల్లా ఎస్ఎస్పీ మోహిత శర్మ విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది హకమ్ (45)గా గుర్తించామన్నారు. ఇతను ఇంతకుముందు కూడా ఉగ్రవాదులకు పలుమార్లు ఆశ్రయం కల్పించాడన్నారు. మరిన్ని వివరాలు విచారణలో వెల్లడవుతాయని మోహిత శర్మ తెలిపారు.