అలీఘర్ లో కాల్పులు ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలు
Two employees were seriously injured in the firing in Aligarh
లక్నో: యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జరిగిన ఈ కాల్పుల ఘటనపై యూనివర్సిటీ ప్రొఫెసర్ వసీం అలీ మాట్లాడుతూ.. ఉద్యోగులు మహ్మద్ నదీమ్, మహ్మద్ కరీంలు రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో చేర్పించామని తెలిపారు. పోలీసులు కాల్పులపై ఆరా తీస్తున్నారని తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారని విచారణ జరుగుతోందన్నారు.