ఉగ్రచర్యలను ఉపేక్షించొద్దు

జమ్మూకశ్మీర్​ పరిస్థితులపై ప్రధాని సమీక్ష

Jun 13, 2024 - 18:51
 0
ఉగ్రచర్యలను ఉపేక్షించొద్దు

శ్రీనగర్​:  జమ్మూకశ్మీర్​ లో జరుగుతున్న వరుస దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్​ఎస్​ఎ అజిత్​ దోవల్​, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా, లెఫ్ట్​ నెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హాలతో గురువారం జమ్మూకశ్మీర్​ పరిస్థితులపై సమీక్షించారు. గత నాలుగైదు రోజులుగా రియాసీ, కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రదాడులపై ఆరా తీశారు. ఓ వైపు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఉగ్రవాదుల చొరబడుతున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న స్లీపర్​ సెల్స్​ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీరి వల్ల దేశ భద్రతకు, అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోకూడదన్నారు. భద్రతను మరింత పెంచి ఇంటలిజెన్స్​ వ్యవస్థల సహాయం తీసుకోవాలన్నారు. సరిహద్దుల్లో చొరబాట్లను ఎంతమాత్రం ఉపేక్షించొద్దని మోదీ పునరుద్ఘాటించారు. ఇక ఆయా యాత్రల కోసం భక్తులు వస్తున్న ప్రాంతాలలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.