సమస్యల పరిష్కారానికి అధికారులకు విన్నపాలు

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి వెంట స్థానికులు

Jun 14, 2024 - 18:09
 0
సమస్యల పరిష్కారానికి అధికారులకు విన్నపాలు

నా తెలంగాణ, అల్వాల్: మచ్చ బొల్లారం, అల్వాల్, వెంకటాపురం డివిజన్ కాలనీ, బస్తీలలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని  అల్వాల్ సర్కిల్ మున్సిపల్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రాలు అందజేసి అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. శుక్రవారం ఉదయం అల్వాల్ మున్సిపల్ సర్కిల్  కార్యాలయంలో మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, బీఆర్​ఎస్​ సీనియర్ నాయకులు కాలనీలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్ డివిజన్లోని  పలు కాలనీ బస్తీలలో  ప్రజా  సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ విషయాలపై మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఉన్నతాధికారులకు తెలియజేశానన్నారు. సమస్యలను పరిష్కరించాలని లేఖలు రాస్తున్నానని కోరారు.

బీటీ, సీసీ రోడ్ ప్యాచ్ వర్క్ లు పలు కాలనీలలో బాక్స్ డ్రైనేజీ, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, చెరువులలో గుర్రపు డెక్క తొలగించడం, అభివృద్ధి పనుల గురించి చర్చించి నూతన అభివృద్ధి ప్రతిపాదనలను సిద్ధం చేయడం, టెండర్ పూర్తి అయి మధ్యలో ఆగిపోయిన పనులను చేపట్టడం ప్రారంభించబోయే పనుల కోసం టెండర్లను పిలవడం గురించి చర్చించారు. 

ఈ కార్యక్రమంలో  అల్వాల్ మున్సిపల్ సర్కిల్ ఇన్చార్జి  డిప్యూటీ కమిషనర్ మల్లయ్య (మల్లారెడ్డి) ఈ.ఈ కాంతి, టౌన్  ప్లానింగ్ ఏసీపీ సాంబయ్య, డిఈ కార్తీక్, రంజిత్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్లు అరుణ్, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు, జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం  కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేశ్, శోభన్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేష్ యాదవ్, కరంచంద్, మేకల రాము యాదవ్, మల్లేష్ గౌడ్, మహేష్, ప్రశాంత్ రెడ్డి, అరుణ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, బస్తీ, కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.