లారీ బోల్తా ఇద్దరు మృతి

Lorry overturned and two died

Jun 14, 2024 - 13:57
 0
లారీ బోల్తా ఇద్దరు మృతి

నా తెలంగాణ, డోర్నకల్: లారీ బోల్తా పడి రోడ్డు పక్కన ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం శుక్రవారం మహబూబాబాద్​ జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. ఎస్పీ సుధీర్​ రాంనాధ్​ తెలిపిన వివరాల ప్రకారం.. జామాయిల్ లోడ్​ తో వెళుతున్న లారీ వేగ నియంత్రణ కోల్పోయి గూడూరు బస్టాపు మూలమలుపు వద్ద బోల్తా పడింది. బస్టాప్​ లో బస్సు కోసం వేచి చూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవేందర్​ గూడూరు సీఐ గన్​ మెన్​ పాపారావులపై లారీ బోల్తా పడడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటీన చేరుకున్న ఎస్పీ సుధీర్​ రాంనాధ్​ సహాయక చర్యలు చేపట్టి లారీని తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.