శ్రీ పద్మావతి ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ  ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Sri Padmavathi Prasanna Venkateswara Swamy Temple's sixth annual Brahmotsavam begins

Jun 14, 2024 - 14:00
 0
శ్రీ పద్మావతి ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ  ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నా తెలంగాణ, అల్వాల్: అల్వాల్ హిల్స్ లోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆరో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణంతో మొదలై విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచనము రక్షాబంధనం రుత్విక్ వరుణ అంకురార్పణ వైన తేజ పఠాధివాసం నైవేద్యం మంగళ శాసనలతో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. భక్తజన సందోహంతో వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల సారథ్యంలో శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆరు రోజులపాటు జరగనున్నాయని ఆలయ అర్చకులు కృష్ణమోహన్ సంతోష్ శుభం ఆలయ చైర్మన్ మురళీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.