విద్యారంగంలో మోదీ చర్యలు భేష్​

టైమ్స్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ ర్యాంకింగ్​–2024లో  వందకుపైగా యూనివర్సిటీలకు చోటు ప్రధాని చర్యలను ప్రశంసించిన ఉన్నతాధికారి ఫిల్​ బట్టీ

Jun 12, 2024 - 20:14
 0
విద్యారంగంలో మోదీ చర్యలు భేష్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: టైమ్స్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ ర్యాంకింగ్​–2024లో దేశవ్యాప్తంగా వందకు పైగా యూనివర్సిటీలకు చోటు దక్కింది. బుధవారం ర్యాంకింగ్​ లకు సంబంధించిన గణాంకాలు ఆ సంస్థ విడుదల చేసింది. 2019లో ఈ 13 యూనివర్సిటీలకు మాత్రమే చోటు దక్కగా 2024లో ఆ సంఖ్య 100కు పైగా చేరడం విశేషం. ఉన్నత విద్యలో భారత్​ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేసిన కృషిని టైమ్స్​ హయ్యర్​ ఉన్నతాధికారి ఫిల్​ బట్టీ ప్రశంసించారు. ఈ సంవత్సరం భారత్​ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందన్నారు. 

ఈ ర్యాంకింగ్​ కోసం 125 దేశాలలోని 2152 విశ్వవిద్యాలయాల పనితీరును బేరీజు వేశారు. మొదటి స్థానాన్ని ఆస్ట్రేలియా దక్కించుకుంది.

ర్యాంకింగ్ అనేది విశ్వవిద్యాలయాల పనితీరును ప్రతిబింబిస్తుంది. పరిశోధన, నిర్వహణ, మెరుగైన విద్య, బాహ్య పరిశోధనలు అనే నాలుగు అంశాలను ప్రామాణికంగా చేసుకొని విశ్వవిద్యాలయాలకు ప్రతీయేటా టైమ్స్​ హయ్యర్​ ఎడ్యుకేషన్​ ర్యాంకింగ్​ ను అందజేస్తుంది.