ఫిబ్రవరి 17న ఇన్ షాట్ 3–డీఎస్ ప్రయోగం
ఇన్ షాట్ 3–డీఎస్ ను ఫిబ్రవరి 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో శాస్ర్తవేత్తలు గురువారం ప్రకటించారు.
ఇస్రో: ఇన్ షాట్ 3–డీఎస్ ను ఫిబ్రవరి 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో శాస్ర్తవేత్తలు గురువారం ప్రకటించారు. ఈ ఉపగ్రహం ద్వారా వాతావరణం, విపత్తుల హెచ్చరికల సేవలు అందనున్నట్లు తెలిపారు. ఈ ఉపగ్రహానికి నిధులను భూ ఉపరితల మంత్రిత్వ శాఖ అందజేసిందని వివరించారు. అదే సమయంలో రానున్న 14 నెలల్లో 30 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఏడు ప్రయోగాలు గగన్ యాన్ తో అనుసంధానమైన ప్రాజెక్టులన్నారు. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ తన మొదటి 3-డి ప్రింటెడ్ రాకెట్ అగ్నిబాన్-సార్టెడ్‌ను వచ్చే రెండు నెలల్లో ప్రయోగించనుందని ఇస్రో తెలిపింది. అగ్నిబాన్ రాకెట్ తొలి ఉప కక్ష్య మిషన్ ప్రయోగం కానుంది. జీఎస్ఎల్వీ–ఎఫ్14, ఇన్సాట్ – 3డీఎస్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. వీటి ద్వారా వాతావరణం, విపత్తు నిర్వహణలపై ఖచ్చితమైన సమాచారం అందుతుందన్నారు. అదే సమయంలో ఎస్ఎస్ ఎల్ వీ ద్వారా మూడో ప్రయోగాన్ని కూడా మార్చిలో నిర్వహించాలని ఇస్రో భావిస్తున్నట్లు వివరించారు. ఇవిగాక మరో రెండు ఉపగ్రహాలు కూడా ఇస్రో ప్రయోగించనుందన్నారు. ఏరోస్పేస్ ద్వారా నాలుగు స్వదేశీంగా నిర్మించిన రాకెట్‌లను విక్రమ్ 1-1 ప్రయోగించనున్నారు. అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్, రెండు ప్రయోగాలకు రూపకల్పన చేసింది. 2024-25లో, ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏడు ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో మూడు మిషన్లు పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ టెస్ట్ వెహికల్ ఉన్నాయి. ఇస్రో వాణిజ్య విభాగం, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, పీఎస్ఎల్వీ నాలుగు ప్రయోగాలు, ఒక ఎల్వీఎం–3 మిషన్, ఎస్ఎస్ఎల్వీ రెండు ప్రయోగాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు ఇస్రో వివరించింది.