కేంద్రమంత్రి భూపతిరాజుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందనలు
Union Minister Kishan Reddy congratulated Union Minister Bhupathi Raju
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారీ పరిశ్రమలు, ఉక్కు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా మంగళవారం పదవీ బాధ్యతలను చేపట్టిన భూపతిరాజు శ్రీనివాస వర్మను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి దంపతులు అభినందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేసేందుకు నూతన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలని కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భూపతిరాజుకు శాలువకప్పి సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం విఘ్నేశ్వరుని ప్రతిమను మంతి భూపతిరాజుకు కిషన్ రెడ్డి అందజేశారు.