బిహార్​ లో పిడుగుపాటుకు 11మంది మృతి

పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

May 12, 2024 - 14:54
 0
బిహార్​ లో పిడుగుపాటుకు 11మంది మృతి

పాట్నా: బిహార్​ లో గత 24 గంటల్లుగా పిడుగుపాట్లతో 11 మంది మృతి చెందారు. శనివారం నుంచి బిహార్​ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగుపాట్లు పడడంతో వాతావరణం తీవ్రరూపం దాల్చింది. ఆదివారం వరకు 11 మంది మృతిచెందినట్లు, పలు చోట్ల చెట్లు, విద్యుత్​ స్తంభాలు, పాత ఇళ్లు నేలకొరిగినట్లు అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరికను కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో వర్షాలు, వడగళ్ళతో అలర్ట్ జారీ చేసింది. 

దీంతో పాటు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, కేరళ, కర్ణాటక, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వేడి ప్రభావం కొనసాగుతోంది. రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణలో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.