ప్రధాని నామినేషన్​ కు అంతా సిద్ధం

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు మే 14న మోదీ నామినేషన్​

May 12, 2024 - 14:31
 0
ప్రధాని నామినేషన్​ కు అంతా సిద్ధం

వారణాసి: వారణాసి ఎంపీ అభ్యర్థి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్​ కు అంతా సిద్ధమైంది. మే 14వ తేదీ మోదీ షెడ్యూల్​ ను పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మంగళవారం నామినేషన్​ కు ముందు పలువురు ఎన్డీయే నాయకులతో 

లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 14 సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సమయంలో పలువురు ఎన్డీయే నేతలు కూడా హాజరు కానున్నారు. మంగళవారం నామినేషన్ వేసే ముందు ప్రధాని మోదీ ఎన్డీయే నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం ప్రధాని వారణాసిలో అస్సీ ఘాట్​ సందర్శన, 10 గంటలకు కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 11 గంటలకు పార్టీ నాయకులతో భేటీ కానున్నారు. అనంతరం 11.40 నామినేషన్​ ను దాఖలు చేయనున్నారు. నామినేషన్​ దాఖలు అనంతరం ఝార్ఖండ్​ కు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ వారణాసి నామినేషన్​ కార్యక్రమం కోసం మూడంచెల భద్రతను పోలీసులు చేపట్టారు. అడుగడుగునా భద్రతా దళాలు, మఫ్టీలో పోలీసులు, కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.