పేదరికం, ఆకలి నిర్మూలనకు 1మిలియన్​ యూఎస్​ డాలర్లు విరాళం

యూఎన్​ అధికారికి అందజేసిన భారత ఐక్యరాజ్యసమితి ప్రతినిధి రుచిరా కాంబోజ్​

Feb 22, 2024 - 14:33
 0
పేదరికం, ఆకలి నిర్మూలనకు 1మిలియన్​ యూఎస్​ డాలర్లు విరాళం

నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఐబీఎస్​ఏ ద్వారా పేదరికం, ఆకలి నిర్మూలన నిధికి భారత్​ 1 మిలియన్​ యూఎస్​ డాలర్లను విరాళంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్ చెక్కును యూఎన్​ ఆఫీస్ ఫర్ సౌత్-సౌత్ కోఆపరేషన్ డిమా అల్-ఖతీబ్‌కు అందజేశారు. ప్రపంచంలో పేదిరక నిర్మూలన, ఆకలిని తీర్చే ఉద్దేశ్యంతో భారత్​, బ్రెజిల్​, దక్షిణాఫ్రికాలు మూడు దేశాలు కలిసి ఐబీఎస్​ఏ కూటమిగా ఏర్పడి సహాయం అందజేశాయి. 

సహకార స్ఫూర్తి బలోపేతం దిశగా భారత్​ చర్యలు..

ఎంఎస్​ కాంబోజ్ మాట్లాడుతూ, ఐబీఎస్​ఏ ఫండ్ గ్లోబల్ సౌత్ అంతటా మిలియన్ల మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు దక్షిణ-దక్షిణ సహకార స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు భారత్​ కట్టుబడి ఉందన్నారు. దీని ద్వారా నిరుపేదల ఆకలితీర్చిన వారమవుతామని కాంబోజ్​ పేర్కొన్నారు.

2004లో ఐబీఎస్​ఏ స్థాపన..

ఐబీఎస్​ఏ ఫెసిలిటీ ఫర్ పావర్టీ అండ్ హంగర్ అలీవియేషన్ మార్చి 2004లో మూడు దేశాలు సంయుక్తంగా స్థాపించాయి. ఈ సంస్థ తరఫున సహాయం అందజేయడాన్ని 2006 నుంచి ప్రారంభించారు. ఆయాదేశాల్లోని నిరుపేదరికం, ఆకలిని బేరీజు వేయడం, నిజమైన లబ్ధిదారుల చెంతకే ఆ నిధులు చేరేలా తద్వారా ఆకలి తీర్చడం కోసం ఈ సంస్థ చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా కూడా ఈ మూడు దేశాలు  స్థాపించిన ఐబీఎస్​ఏ నిరుపేదల ఆకలి తీరుస్తూ పలుదేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
...............