త్వరలో సెమికాన్​ 2.0

పర్యావరణ వ్యవస్థ సవాళ్లను అధిగమిస్తాం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

Sep 11, 2024 - 16:55
 0
త్వరలో సెమికాన్​ 2.0
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పర్యావరణ వ్యవస్థలోని సవాళ్లను అధిగమిస్తూనే సెమీకండక్టర్ ప్రోగ్రామ్ సెమికాన్2.0ను  ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు.2.0ను త్వరలోనే భారత ప్రభుత్వం ఆవిష్కరిస్తుందన్నారు. గ్రేటర్​ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమికాన్ ఇండియా సమ్మిట్‌లో వైష్ణవ్ మాట్లాడుతూ, ‘సెమికాన్ 2.0 మూడు నాలుగు నెలల్లో ఆవిష్కరిస్తామన్నారు. రెండోదశపై దృష్టి సారించామని తెలిపారు. దేశంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 2021లో రూ. 76వేల కోట్లు కేటాయించామన్నారు. సెమీకండక్టర్​ ఎకోసిస్టమ్​ అంతర్జాతీయ గుర్తింపు పొందుతోందని మంత్రి తెలిపారు. మొహాలీలో సెమీకండక్టర్ ల్యాబ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. త్వరలోనే ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గానికి అందజేస్తామని మంత్రి వెల్లడించారు. 
 
ఇప్పటివరకూ దేశంలో ఐదు సెమీకండక్టర్​ యూనిట్లు ఆమోదించామన్నారు. గుజరాత్​ లో రెండు, అసోంలో ఒకటి ఆమోదించామన్నారు. 2024 చివరి నాటికి ఈ యూనిట్లు పూర్తి ఉత్పత్తిని సాధిస్తాయన్నారు. వందశాతం ఎలక్ట్రానిక్‌ తయారీ భారత్‌లోనే జరగాలన్నదే తమ అభిమతమని మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు.