అశ్లీల సైట్లు, ఖాతాలపై కేంద్రం చర్యలు

సోషల్​ మీడియా ఖాతాలు, ఓటీటీలు, పలు అశ్లీల కంటెంట్​లను ప్రసారం చేస్తున్న వాటిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Mar 14, 2024 - 16:22
 0
అశ్లీల సైట్లు, ఖాతాలపై కేంద్రం చర్యలు

నా తెలంగాణ, ఢిల్లీ: సోషల్​ మీడియా ఖాతాలు, ఓటీటీలు, పలు అశ్లీల కంటెంట్​లను ప్రసారం చేస్తున్న వాటిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 19 వెబ్​సైట్లు, 10 యాప్ లు, 57 సోషల్​ మీడియా ఖాతాలు,18 ఓటీటీలను గురువారం బ్యాన్​ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సైట్ల సేవలను నిలిపివేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు ఈ సైట్లు అశ్లీల కంటెంట్​ను అందిస్తున్నారని గుర్తించామన్నారు. పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో చర్యలకు ఉపక్రమించామన్నారు. 13 ఫేస్​ బుక్​ ఖాతాలు, 17 ఎక్స్​, 16 ఇన్​ స్టాగ్రామ్​, 12 యూ ట్యూబ్​ అకౌంట్లను కూడా బ్లాక్​ చేసినట్లు తెలిపారు. ఆయా సైట్లు మహిళా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయన్నారు. భారతీయ శిక్షాస్మృతి, కంటెంట్ కింద చర్యలు తీసుకున్నామని మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.