మోదీ పాలనలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు.

Feb 14, 2024 - 16:44
 0
మోదీ పాలనలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం

నా తెలంగాణ, హైదరాబాద్​: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు కూడా ప్రాంతీయ భాషల్లో రాసుకునే వెసులు బాటు కల్పించారని గుర్తు చేశారు. ఇతర భాషలపై మోజు ఉండాలి కానీ మాతృభాషను మాత్రం చంపుకోకూడదని అన్నారు. బుధవారం వసంత పంచమి సందర్భంగా అంబర్​ పేటలోని మహంకాళీ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు తమ  పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించాలని సూచించారు. దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఉన్నదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. సామాజిక సంస్థలు, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దేశంలో  అక్షరాస్యతను పెంచడానికి ప్రయత్నం చేయాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని అందులో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించిందని చెప్పారు. మాతృ భాషలో చదువుకోవచ్చు పరీక్షలను రాయవచ్చని తెలిపారు.