జ్ఞానవాపీ,శ్రీ కృష్ణ జన్మభూమి.. సోదరభావంతో ఇచ్చేయాలి
ఆక్రమణ దారుల దాడుల్లో 3500 దేవాలయాలు ధ్వంసం అయ్యాయని, ముస్లిం సోదరులు జ్ఞానవాపీ,కృష్ణ జన్మభూమి ఆలయాలు హిందువులకిచ్చేస్తే మిగతా ఆలయాల వైపు చూడబోమని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి అన్నారు.
పూణె: ఆక్రమణ దారుల దాడుల్లో 3500 దేవాలయాలు ధ్వంసం అయ్యాయని, ముస్లిం సోదరులు జ్ఞానవాపీ,కృష్ణ జన్మభూమి ఆలయాలు హిందువులకిచ్చేస్తే మిగతా ఆలయాల వైపు చూడబోమని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి అన్నారు. దేవ్ గిరి 75వ జన్మదిన వేడుకలు 4 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ పూణేలో వివిధ మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పూణెలోని అలందిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానవాళి గతంలో కాదు వర్తమానం, భవిష్యత్తులో జీవించాలన్నారు. దేశానికి ఒక పక్కా ప్రణాళిక, మంచి భవిష్యత్ ఉండాలంటే హిందువులకు ముస్లింలు సోదరభావంతో మెలగాలన్నారు. పెద్ద ఎత్తున దేవాలయాల ధ్వంసం అనేవి దేశంపై అతిపెద్ద మరకలని విచారం వ్యక్తం చేశారు. ఈ రెండు దేవాలయాలను అందజేస్తే మరింత సోదరభావం పెరిగేందుకు ఇతర సమస్యల పరిష్కారానికి కూడా శాంతియుతంగా ముగుస్తాయని ఆశిస్తున్నట్లు దేవ్ గిరి తెలిపారు. భారత నవ నిర్మాణంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటేనే మంచిదని ముస్లిం సమాజం కూడా ఇందుకు సిద్ధంగా ఉందని అయితే దీన్ని కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారని గోవింద్ దేవ్ గిరి ఆరోపించారు.