సోషల్​ మీడియాలో జాగ్వార్​ హల్​ చల్​

నా తెలంగాణ, హైదరాబాద్​: భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్​ ఫైటర్​ జెట్​ సోషల్​ మీడియాలో భారీ హల్​చల్​నే సృష్టిస్తోంది. రోజురోజుకు, గంటగంటకు, నిమిష నిమిషానికి వీక్షకులను ఆకట్టుకుంటోంది.

Feb 5, 2024 - 17:32
 0
సోషల్​ మీడియాలో జాగ్వార్​ హల్​ చల్​

నా తెలంగాణ, హైదరాబాద్​: భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్​ ఫైటర్​ జెట్​ సోషల్​ మీడియాలో భారీ హల్​చల్​నే సృష్టిస్తోంది. రోజురోజుకు, గంటగంటకు, నిమిష నిమిషానికి వీక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే జాగ్వార్​ ఫైటర్​ జెట్​ కొత్త విమానం ఏం కాదు. ఈ రకమైన విమానాలు 1968 నుంచి 1981 వరకు ప్రపంచంలో మొత్తం 573 జాగ్వార్ యుద్ధ విమానాలు మాత్రమే తయారు చేశారు. అటు పిమ్మట వీటి తయారీ నిలిచిపోయింది. అయితే భారతీయ వైమానిక దళంలో ఇప్పటికీ కొన్ని జాగ్వార్​ యుద్ధ విమానాలు ఉన్నాయి. 
ఎక్సల్​ లో జాగ్వార్​ తాజా ఫోటో అత్యంత ఆకట్టుకునేలా ఉంది. ఓ వైపు వంగి రెండు మిస్సైళ్లతో, ఓ బాలిస్టిక్​ మిస్సైల్​ , మరోవైపు ఇంజన్​ లోని సన్నని మంటలు కక్కడం ఈ దృశ్యం కాస్త పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ విమాన దృశ్యం ఒక వైపు వంగుతూనే గూగ్లీ బౌల్​ లా టర్న్​ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 
భారత వైమానిక దళంలో 160 జాగ్వార్ విమానాలు ఉన్నాయి. వాటిలో 30 శిక్షణ కోసం ఉన్నాయి. భారతదేశంలో దీనిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. 
55.3 అడుగుల పొడవున్న ఈ విమానం రెక్కలు 28.6 అడుగులు. ఎత్తు 16.1 అడుగులు. టేకాఫ్ సమయంలో దీని గరిష్ట బరువు 15,700 కిలోలు. ఇందులో 4200 లీటర్ల ఇంధనం ఉంటుంది. ఇది కాకుండా, 1200 లీటర్ల డ్రాప్ ట్యాంకులను కూడా అమర్చవచ్చు.
సముద్ర ఉపరితలంపై దీని గరిష్ట వేగం గంటకు 1350 కిలోమీటర్లు. కాగా, 36 వేల అడుగుల ఎత్తులో గంటకు 1700 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. అన్ని ఇంధన ట్యాంకులు నిండితే అది 1902 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. గరిష్టంగా 46 వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలదు. కేవలం ఒకటిన్నర నిమిషాల్లోనే 30 వేల అడుగులకు చేరుకుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది 600 మీటర్ల చిన్న రన్‌వేపై కూడా టేకాఫ్ లేదా ల్యాండింగ్ చేయగలదు.