ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కేజ్రీకి తలపోటు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ కు ఒకటి కాకపోతే మరోటి అన్నట్లుగా అవినీతి, కుంభకోణాల కేసులు తలపోటును కలిగిస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్​ ఇంటికి ఢిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు శనివారం నోటీసులిచ్చేందుకు వెళ్లారు. శుక్రవారం రాత్రి కూడా నోటీసులిచ్చేందుకు వెళ్లగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు, పలువురు నేతలు నిరాకరించారని పోలీసులు తెలిపారు. శనివారం నోటీసులను అందజేశామని క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు తెలిపారు. ఈ నోటీసుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని పేర్కొన్నారు. ఎవరెవరిని కొనుగోలుకు ప్రయత్నించారో అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను అందించాలని పేర్కొంది. గతంలో బీజేపీ రూ. 25 కోట్లకు ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం అనే ఆరోపణలను ఆప్​ పార్టీ చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని కూడా ఆరోపించింది. ఈ విషయాన్ని సీరియస్​ గా తీసుకున్న ఢిల్లీ బీజేపీ నాయకులు క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చేసిన ఆరోపణలపై తగిన ఆధారాలు చూపేలా కేసు నమోదు చేయాలన్నారు. ఆధారాలు చూపించకుంటే ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు కేజ్రీవాల్​ ఇంటికి వెళ్లారు. మరోవైపు ఐదోసారి కూడా ఈడీ సీఎం కేజ్రీవాల్​ కు సమన్లు సమర్పించినా ఆయన విచారణకు హజరుకాలేదు.

Feb 3, 2024 - 15:35
Feb 3, 2024 - 15:42
 0
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కేజ్రీకి తలపోటు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ కు ఒకటి కాకపోతే మరోటి అన్నట్లుగా అవినీతి, కుంభకోణాల కేసులు తలపోటును కలిగిస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్​ ఇంటికి ఢిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు శనివారం నోటీసులిచ్చేందుకు వెళ్లారు. శుక్రవారం రాత్రి కూడా నోటీసులిచ్చేందుకు వెళ్లగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు, పలువురు నేతలు నిరాకరించారని పోలీసులు తెలిపారు. శనివారం నోటీసులను అందజేశామని క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు తెలిపారు. ఈ నోటీసుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని పేర్కొన్నారు. ఎవరెవరిని కొనుగోలుకు ప్రయత్నించారో అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను అందించాలని పేర్కొంది. 
 గతంలో బీజేపీ రూ. 25 కోట్లకు ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం అనే ఆరోపణలను ఆప్​ పార్టీ చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని కూడా ఆరోపించింది. ఈ విషయాన్ని సీరియస్​ గా తీసుకున్న ఢిల్లీ బీజేపీ నాయకులు క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చేసిన ఆరోపణలపై తగిన ఆధారాలు చూపేలా కేసు నమోదు చేయాలన్నారు. ఆధారాలు చూపించకుంటే ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు కేజ్రీవాల్​ ఇంటికి వెళ్లారు. మరోవైపు ఐదోసారి కూడా ఈడీ సీఎం కేజ్రీవాల్​ కు సమన్లు సమర్పించినా ఆయన విచారణకు హజరుకాలేదు.