యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

యోగా మహోత్సవ్​–2024 ప్రారంభోత్సవంలో ప్రముఖులు

Mar 13, 2024 - 18:30
 0
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

నా తెలంగాణ, ఢిల్లీ: ప్రపంచ ఆరోగ్యం, శాంతిని పెంపొందించడంలో యోగా విస్తృత  పాత్రను పోషిస్తుందని, పురుషులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా యోగా ద్వారా సంపూర్ణ ఆయురారోగ్యాలను దరి చేర్చుకోవచ్చని ఆయుష్​ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్​ కొటేచా, యోగా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ హంసాజీ జయదేవా, బెంగళూరు ఎస్​వివైఎఎస్​ఏ విశ్వవిద్యాలయం ఛాన్స్​లర్​డాక్టర్ హెచ్‌ఆర్ నాగేంద్ర లు పేర్కొన్నారు. మహిళా సాధికారత నేపథ్యంలో యోగా మహోత్సవ్​–2024ను ఢిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో బుధవారం జ్యోతివెలిగించి ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. యోగా ద్వారా ఒత్తిడి లాంటి పరిస్థితులను అవలీలగా అధిగమించవచ్చన్నారు. మహిళలను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ, సామాజిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును యోగా ద్వారా సాధించుకోవచ్చన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, సునిశ్చిత దృష్టి, ఆలోచనలు మెరుగు పడతాయన్నారు. నేడు ప్రపంచదేశాల్లో యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. ప్రతీఒక్కరూ యోగాను మన దైనందిన జీవితంతో అనుసంధానిస్తూ మరింత మందికి యోగాపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఆయుష్ జాయింట్ సెక్రటరీ, కవితా గార్గ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ డిడిజి సత్యజిత్ పాల్, ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు (ఆయుర్వేదం), వైద్య మనోజ్ నేసరి, నేషనల్ కమీషన్ ఆఫ్ హోమియోపతి, డాక్టర్ అనిల్ ఖురానా, ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. డైరెక్టర్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్​ఐవై), విజయలక్ష్మి భరద్వాజ్‌ స్వాగతం పలికారు.