ఖతార్ లో మోదీ నినాదాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దోహాలో భారతీయ సమాజం, ఖతార్ ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.
దోహా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దోహాలో భారతీయ సమాజం, ఖతార్ ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘మోదీ, మోదీ’ నినాదాలు ప్రతిధ్వనించాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఖతార్‌కు చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీతో మోదీ సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. కాగా ప్రధానమంత్రి ఖతార్‌కు వెళ్లడం ఇది రెండోసారి. ఆయన మొదటిసారిగా జూన్ 2016లో ఖతార్‌ను సందర్శించారు. నవంబర్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించబడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిని విడుదల చేసిన తర్వాత ప్రధానికి ఇదే మొదటి పర్యటన కావడం విశేషం.