ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ
జైపూర్: ఈ రోజు ఎంతో ఉత్కంఠత నెలకొన్న రోజని, ప్రజాస్వామ్య పండుగ రోజని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్ అన్నారు. శుక్రవారం ఆయన జైపూర్ లో భార్య, కుమారుడితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ తమ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజస్థాన్ భవిష్యత్తుకు ప్రజాస్వామ్యం ద్వారా మరోమారు తీర్పు చెప్పే అరుదైన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. చరిత్ర పునరావృతం అవుతుందని భావిస్తున్నట్లు సీఎం భజన్ లాల్ శర్మ అన్నారు.