సీఎం కేజ్రీకి సుప్రీంలో చుక్కెదురు
బెయిల్ పిటిషన్ ఆగస్ట్ 23కు విచారణ సీబీఐకి నోటీసులు జారీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేజ్రీవాల్ కు సుప్రీంలోనూ చుక్కెదురైంది. బుధవారం మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పిటిషన్ పై సుప్రీం విచారణ చేపట్టింది. మధ్యంతర బెయిల్ ను తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ పై ఆగస్ట్ 23కు విచారణ వాయిదా వేసింది. ఈ బెయిల్ పిటిషన్ ను జస్టిస సూర్యకాంత్, ఉజ్వల్ భూయాన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. బెయిల్ పై సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 23లోగా సీబీ సమాధానం చెప్పాలని పేర్కొంది. ఆరోగ్య కారణాలను చూపుతూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సింఘ్వి తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని సుప్రీం పరిగణనలోకి తీసుకోలేదు.