రాజ్యాంగాన్ని నిష్క్రియం చేశారు
deactivated the constitution
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కాంగ్రెస్ ను తూర్పారబట్టిన మంత్రి
జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటారా?
జైరామ్ రమేష్ క్షమాపణ చెప్పాలి
మిసా పేరు ఎందుకు పెట్టారు లాలూకు సూటి ప్రశ్న?
భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా ఉల్లంఘించిందెవరు?
‘కిస్సా కుర్సీ కా’ సినిమాను ఎందుకు బ్యాన్ చేశారు?
రాజ్యసభలో ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాజ్యాంగాన్ని వారి కుటుంబ బలోపేతానికే ఉపయోగించుకున్నారే గానీ ఏనాడు దేశక్షేమం కోసం ఉపయోగించాలన్న ఇంగితజ్ఞానం కాంగ్రెస్, కుటుంబతత్వ పార్టీకి లేకుండా పోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. రాజ్యాంగంపై చర్చను సోమవారం పార్లమెంట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు.
జీఎస్టీపై జై రామ్ రమేష్ అసత్యాలు..
అధికారంలో ఉండగా రాజ్యాంగానికి ఎలాంటి విలువనీయలేదని ఆరోపించారు. నెహ్రూ, ఇందిరాగాంధీల సమయం నుంచి కూడా రాజ్యాంగాన్ని నిష్ర్కీయం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దేశాన్ని బలోపేతం చేసే జీఎస్టీని తీసుకువస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించడం పట్ల కాంగ్రెస్ పార్టీ దుర్నీతి అర్థమైపోతుందన్నారు. దేశ ఆర్థిక స్థితిపై ఏ మాత్రం ఈ పార్టీకి ప్రేమాభిమానాలు లేవన్నారు. జీఎస్టీపై అసత్యాలు చెప్పిన కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ వెంటనే లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఆర్థిక మంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో మహారాష్ర్ట జీఎస్టీని వ్యతిరేకించిందన్నారు. ఈ సవరణను ప్రవేశపెట్టడంలోనూ విఫలమయ్యారని దుయ్యబట్టారు.
లాలూ పాలనంతా అవినీతి, అక్రమాలే..
ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లి ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన నాయకుడు తనకూతురుకు మిసా అని పేరు పెట్టాడని లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దేశ అభివృద్ధిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఆయన రాజకీయ భవిష్యత్ అంతా అవినీతి, అక్రమాలతో కూడుకున్నదని విమర్శించారు. మిసా అని పేరు ఎందుకు పెట్టారో దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని లాలూ ప్రసాద్ యాదవ్ ను మంత్రి నిర్మలమ్మ నిలదీశారు.
అరెస్టులు, సినిమాలపై నిషేధాలు ఎందుకు?..
1949లో మజ్రూహ్ సుల్తాన్‌పురి, బల్‌రాజ్ సాహ్నీ ప్రశ్నలు లేవనెత్తితే వారిని జైలుకు పంపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మిల్లు కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మజ్రూహ్ సుల్తాన్‌పురి జవహర్‌లాల్ నెహ్రూ కు వ్యతిరేకంగా రాసిన కవితను వినిపించారు. అందుకే ఆయనను జైలుకు పంపారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టడంలో కాంగ్రెస్ రికార్డు ఈ ఇద్దరికే పరిమితం కాలేన్నారు. మైఖేల్ ఎడ్వర్డ్స్ రాసిన రాజకీయ జీవిత చరిత్ర ‘నెహ్రూ’ 1975లో ఎందుకు నిషేధించారని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె కుమారుడిపై ప్రశ్నలు లేవనెత్తినందుకు వారు ‘కిస్సా కుర్సీ కా’ అనే చిత్రాన్ని కూడా నిషేధించారని మంత్రి మండిపడ్డారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పటిష్టమైందన్నారు. అందుకే ఇంతగా మీరు నోరు తెరవగలుగుతున్నారన్నారు. కానీ అన్ని అసత్యాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
రాజ్యసభ ఎంపీల ప్రమాణ స్వీకారం..
ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీఎంసీ పశ్చిమ బెంగాల్ రితబ్రత బెనర్జీ
బీజేపీ (హరియాణా) నుంచి రేఖా శర్మ
బీజేపీ (ఒడిశా) నుంచి సుజిత్ కుమార్
టీడీపీ (ఆంధ్రప్రదేశ్) సతీష్ బాబు
టీడీపీ (ఆంధ్రప్రదేశ్) బి. మస్తాన్ రావు యాదవ్
బీజేపీ (ఆంధ్రప్రదేశ్) ఆర్. కృష్ణయ్య