మూడో ప్రపంచ యుద్ధం? ఇజ్రాయెల్​ ఓడ స్వాధీనం

ఇరాన్​ చర్యలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఓడలో 17 మంది భారత్ సిబ్బంది? దౌత్య సంబంధాల ద్వారా సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నాలు? నౌక చుట్టూ అగ్రరాజ్యాల వాయుసేన మోహరింపు

Apr 13, 2024 - 19:38
 0
మూడో ప్రపంచ యుద్ధం?  ఇజ్రాయెల్​ ఓడ స్వాధీనం

న్యూఢిల్లీ: ఇరాన్​ – ఇజ్రాయెల్​ మధ్య అనుకున్నట్లుగానే యుద్ధం ప్రారంభం అయ్యే సూచనలు మొదలయ్యాయి. ఇరాన్​ ఇజ్రాయెల్​ వ్యాపారికి చెందిన ఓ భారీ ఓడను స్వాధీనం చేసుకుంది. ఈ ఓడ భారత్​ కు రానున్నండడం గమనార్హం. ఆ ఓడను ఇరాన్​ తీసుకువెళుతున్నారు. కాగా ఆ ఓడ చుట్టూ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగడం గమనార్హం. ఏ క్షణంలో ఏమవుతుందోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

భారత్​ వస్తున్న కార్గోషిప్​ ఇరాన్​ స్వాధీనం..

ఒమన్​ గల్ఫ్​ హార్ముజ్​ పాస్​ మీదుగా భారత్​ కు వస్తున్న కార్గో షిప్​ ను శనివారం తెల్లవారుజామున ఇరాన్​ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ షిప్​ లండన్​ కు చెందినది. ప్రస్తుతం ఇజ్రాయెల్​ వ్యాపారి దీని నిర్వహణ చేపట్టారు. ఈ ఓడలో 20 మంది సిబ్బంది కూడా ఉన్నారు. వీరంతా ఫిలిప్పీన్స్​ పౌరులుగా తెలుస్తోంది. అయితే ఓడలో 17 మంది భారతీయులు ఉన్నారనే వార్తలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. 

దాడులను సమర్థంగా ఎదుర్కొంటాం: ఇజ్రాయెల్​

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డానియార్ హగారి మాట్లాడుతూ - ఎలాంటి దాడులనైనా తాము సమర్థంగా ఎదుర్కొంటామని మౌనంగా ఉండబోమని వెల్లడించారు. దాడికి ప్రతీదాడి కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరుదేశాల్లో యుద్ధ ఘంటికలు మోగుతున్నట్లు భారతదేశంతో సహా ఆరు దేశాలు - అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ తమ పౌరులకు సలహాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రకటన జారీ చేసి 24 గంటలు కూడా గడవకముందే ప్రమాద ఘంటికలు మ్రోగడం కలవరం సృష్టిస్తోంది. 

కాగా ఓడలో ఉన్న భారతీయులకు సంబంధించి ఇరాన్​ తో దౌత్యమార్గాల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. 

ఇరాన్​ స్వాధీనం చేసుకున్న ఓడలో 20 శాతం ఇంధనం ఉన్నట్లు సమాచారం. దీని చుట్టూ అమెరికా, భారత్​, ఇరాన్​, ఇజ్రాయెల్​ తదితర దేశాలకు సంబంధించిన వాయుసేనలు కూడా ఓడను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు దౌత్య సంబంధాల ద్వారా ఇరుదేశాల్లో ఉద్రిక్తతలు చల్లార్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. 

ఏది ఏమైనా ఇరాన్​ ఈ చర్య అంతర్జాతీయంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోననే భయాందోళనలు నెలకొన్నాయి.