మూడోవిడత 40 స్థానాలకు ఎన్నికలు
కశ్మీర్ లో 16, జమ్మూలో 24 స్థానాల్లో నిర్వహణ
ఫలించనున్న ప్రధాని, కేంద్రమంత్రుల అభివృద్ధి వ్యూహాం
ఓటర్ల ఆలోచనా విధానంలో సమూల మార్పునకు శ్రీకారం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: జమ్మూకశ్మీర్ లో తొలిసారిగా పూర్తి మెజార్టీతో మోదీ నేతృత్వంలో కమలం పార్టీ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం ఉంది. మూడోదశలో బీజేపీ అత్యంత పటిష్ఠంగా ఉండడమే ఇందుకు కారణం. ఆ తరువాతి స్థానాల్లో ఎన్సీపీ–కాంగ్రెస్, పీడీపీలు ఉండనున్నాయి. పదేళ్ల తరువాత జమ్మూకశ్మీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 1న మూడో (అంతిమ) విడత ఎన్నికలు 40 స్థానాల్లో జరగనున్నాయి.
ఇక్కడి ఓటర్లలో అభివృద్ధి ఏజెండాను బీజేపీ నరనరాన తీసుకువెళ్లడంలో సఫలీకృతం అయ్యింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, జి. కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ లాంటి నాయకులు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. హింసా, ఉగ్ర మార్గం ముళ్లబాటల్లాంటివని చెప్పడంలో, వివరించడంలో, అర్థం చేయించడంలో కృతకృత్యులయ్యారు. అదీగాక గతపదేళ్లుగా మోదీ హయాంలో ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులు కూడా ఈ ప్రాంత వాసులను ఆలోచింప చేస్తున్నాయి. ఉపాధి మార్గాలు మెరుగుపడ్డాయి. రాళ్లు పట్టుకున్న చేతుల్లో నిజాయితీగా సంపాదించుకున్న డబ్బులు కనిపిస్తుండడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించినట్లయ్యింది. దీంతో ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి.
మూడోదశలో బీజేపీ బీజేపీ గరిష్టంగా సీట్లు పొందే అవకాశం ఉంది. ఎన్సీ–కాంగ్రెస్ కు కలిసి వచ్చే సీట్లలో ఇండిపెండెంట్ లు పాగా వేసే అవకాశం ఉంది. ఇది ఇటు బీజేపీకీ అనుకూలించనుంది.
కశ్మీర్‌లోని 16 సీట్లలో చాలా వరకు ఇంజనీర్ రషీద్ ప్రభావం ఉంటుంది. ఈ దశలో ఆయన పార్టీ ఏఐపీ బలంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రషీద్ ప్రభావం ఎక్కువగా ఎన్సీ–కాంగ్రెస్ లపై పడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో పీడీపీ బాగా వెనుకబడనుంది.
గురేజ్ స్థానంలో గెలిస్తే జమ్మూకశ్మీర్ లో సత్తా ఏర్పాటు చేసినట్లుగానే భావిస్తారు. ఈ ప్రాంతంలో మూడోవిడత జరిగే ఎన్నికల్లో బీజేపీ అత్యంత పటిష్ఠంగా ఉంది. ఓటర్ల నాలుకల్లోనూ ఎక్కడ చూసినా మోదీ పేరే వినబడుతోంది.