విలువలు లేని కడియం 

మంద కృష్ణ మాదిగ దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

Apr 13, 2024 - 21:33
 0
విలువలు లేని కడియం 

నా తెలంగాణ, వరంగల్: కడియం శ్రీహరి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ విలువలు నిరూపించుకో అంటూ సవాల్ చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని చూసి నేర్చుకో .. లేదా బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ ను ఆదర్శంగా తీసుకొని రాజీనామా చేయాలని కోరారు. మళ్ళీ పోటీచేసి నీ విలువ నిరూపించుకోమన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఒక పార్టీ లో గెలిచి ఇంకొక పార్టీ లోకి పోతే రాజీనామా చేసి వెళ్లాలని అన్నాడు..ఇప్పుడు కడియం అదే విధానం పాటించాలన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. స్వార్ధ పూరిత రాజకీయాలు చేసుకుంటూ నన్ను విమర్శించే హక్కు నీకు లేదని మందకృష్ణ మాదిగ హితవు పలికారు.