జూనియర్ మిల్కీ బ్యూటీకి ఆఫర్లేవి?

హీరోయిన్ తమన్నాని ఫ్యాన్స్‌ మిల్కీ బ్యూటీ అంటూ అభిమానంతో పిలుచుకుంటారు.

Apr 19, 2024 - 16:47
 0
జూనియర్ మిల్కీ బ్యూటీకి ఆఫర్లేవి?

హీరోయిన్ తమన్నాని ఫ్యాన్స్‌ మిల్కీ బ్యూటీ అంటూ అభిమానంతో పిలుచుకుంటారు. తమన్నా మాదిరిగా మిల్కీ స్కిన్‌ టోన్‌ తో ఆకట్టుకునే విధంగా ఉన్న మెహ్రీన్‌ కి కెరీర్‌ ఆరంభంలో జూనియర్ మిల్కీ బ్యూటీ అనే పేరు పెట్టారు కొందరు. తమన్నా మాదిరిగా మెహ్రీన్ కెరీర్‌ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా ఇంకా ఆఫర్ల కోసం, హిట్‌ కోసం ఎదురు చూస్తూనే ఉన్న మెహ్రీన్‌ సోషల్‌ మీడియాలో మాత్రం స్టార్‌ హీరోయిన్స్ రేంజ్‌ లో అందాల ఆరబోత చేస్తూ అదుర్స్ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి మెహ్రీన్‌ చూపు తిప్పుకోనివ్వని విధంగా షో చేసింది.

విభిన్నమైన డిజైనర్‌ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ థైస్ అందాన్ని చూపించిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతటి అందగత్తెకు ఎందుకు టాలీవుడ్‌ లో కానీ ఇతర భాషల్లో కానీ ఆఫర్లు రావడం లేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. "నేను కూడా ఈ ఫోటోను చూస్తూ ఉండి పోతున్నాను. స్క్రోలింగ్‌ చేయకుండా అలాగే చూస్తున్నాను'' అన్నట్లుగా మెహ్రీన్‌ ఈ ఫొటోకు కామెంట్‌ పెట్టింది. సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మెహ్రీన్ ఈ ఫొటోలతో ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది.