ఇల్లీ...బేబీ మాధుర్యం

ప్రసవానంతర పోరాటాల గురించి ఇలియానా డిక్రూజ్ క్రిప్టిక్ పోస్ట్ తాజా డిస్క‌ష‌న్ పాయింట్.

Apr 18, 2024 - 15:11
 0
ఇల్లీ...బేబీ మాధుర్యం

ప్రసవానంతర పోరాటాల గురించి ఇలియానా డిక్రూజ్ క్రిప్టిక్ పోస్ట్ తాజా డిస్క‌ష‌న్ పాయింట్. ఇటీవల సోషల్ మీడియాలో ఇల్లీ హృద్య‌మైన పోస్ట్ ని షేర్ చేసింది. బిడ్డ‌ను క‌న్న త‌ర్వాత త‌న మ‌నో స్థితి గురించి ప్ర‌స్థావించింది. నిజానికి క‌రీనా, శ్రీ‌య‌, స‌మీరా రెడ్డి, అనుష్క శ‌ర్మ‌, ఉపాస‌న స‌హా చాలా మంది బిడ్డ‌ను క‌న్న త‌ర్వాత త‌మ మ‌ధురానుభూతుల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌లుగా పంచుకున్నారు. అదే విధంగా ఇలియానా కూడా ఈ పోస్ట్ లో కొత్త సంగ‌తుల‌పై ఓపెనైది. తన పోస్ట్‌లో ఇలియానా ప్రసవానంతర జీవితంలోని సవాళ్ల గురించి ఓపెనైంది. కొత్త తల్లులు ఎదుర్కొంటున్న తరచుగా బ‌య‌టికి చెప్పని పోరాటాల గురించి అర్ధవంతమైన సంభాషణకు ఇల్లీ తెర తీసింది. ఇలియానా ఈ పోస్ట్‌తో పాటుగా శిశువును పట్టుకుని ఉన్న స్త్రీ ఫోటోని షేర్ చేసింది. ప్రసవానికి సంబంధించిన గుర్తులను కలిగి ఉన్న పొట్ట భాగం, శరీరం, కొత్త తల్లులు ఎదుర్కొనే అనేక భావోద్వేగాలు ప్రశ్నలను ఈ పోస్ట్ ఆవిష్క‌రించింది. రిపీటెడ్ గా 'ఇట్స్ ఓకే' అనే పదం ఓదార్పు మంత్రంగా పనిచేస్తుంది. ఈ పరివర్తన దశలో సహనం, స్వీయ కరుణ, అంగీకారాన్ని స్వీకరించమని కొత్త తల్లులను ప్రోత్సహించే విష‌యాలున్నాయి. ఇలియానా క్యాప్షన్ మాతృత్వంతో పాటు వచ్చే భావోద్వేగ అల్లకల్లోలాన్ని లోతుగా ఆవిష్క‌రించింది. పదే పదే అభయమివ్వ‌డం క‌నిపించింది. మీకు జుట్టు రాలింది.. అయినా ఫర్వాలేదు..మంచం వేయలేదు ఫర్వాలేదు...ఇట్స్ ఓకే యో.. అంటూ చ‌ర్చ పై ఆస‌క్తిని క‌లిగించింది. ఇలియానా ఒక విదేశీ ప్రియుడితో అనుబంధంలో ఉంది. అత‌డి పేరు మైఖేల్ డోల‌న్. అతడితో త‌న తొలి బిడ్డ‌ను ప్ర‌స‌వించిన సంగ‌తి తెలిసిందే. 
=======================================