స్మారక చిహ్నాల రక్షణ ఎన్ ఎంఎ పాత్ర అభినందనీయం
కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జాతీయ స్మారక చిహ్నాలను సంరక్షించడం, పరిరక్షిచడం కోసం ఎన్ ఎంఎ (నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ)ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు. శనివారం న్యూ ఢిల్లీలో ఎన్ ఎంఎ 14వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘వికాస్ భీ, విరాసత్ భీ’ (అభివృద్ధి, సుస్థిరత, ఆస్తుల సంరక్షణ) విజన్‌పై మాట్లాడారు. గత పదేళ్లలో దేశంలోని వివిధ రంగాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో, స్మారక చిహ్నాల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. సంస్కృతి, యోగా, వాస్తుశిల్పం, మేధస్సు కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని మంత్రి షెకావత్ పేర్కొన్నారు. వీటి రక్షణలో నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రమంత్రి షెకావత్ అభినందించారు.