వక్ఫ్​ భూమి.. రైతులకు నోటీసులు

ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు

Oct 26, 2024 - 18:15
 0
వక్ఫ్​ భూమి.. రైతులకు నోటీసులు
విజయపుర హోన్వాడ 1200 ఎకరాలపై వివాదం
భూములు లాక్కునేందుకు మంత్రి జమీర్​ అహ్మద్​ ఖాన్​ కుయుక్తులు
నెల మొదట్లో మంత్రి జమీర్​ సమావేశం.. ఆ తరువాత వివాదం
కర్ణాటకలో కాంగ్రెస్​ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న రైతులు
బెంగళూరు: కర్నాటకలో 1200 ఎకరాల రైతుల భూమిని వక్ఫ్​ బోర్డుగా పేర్కొనడం, రైతులకు నోటీసులు పంపించడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యమైని రైతులు హెచ్చరించారు. శనివారం పలువురు రైతులు పలు పార్టీల నాయకులో కలిసి పెద్ద యెత్తున నిరసనలకు దిగారు. విజయపుర జిల్ల హోన్వాడ గ్రామంలో 1200 ఎకరాల భూమి వక్​ఫ్​ కు చెందిందని తహశీల్దార్​ నోటీసులు పంపి రైతుల నుంచి వివరణ కోరారు. దీనిపై రైతులంతా స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్​ మంత్రి ఎంబీ పాటిల్​ కు ఫిర్యాదు చేశారు. తమ భూములు లాక్కునేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్​ అహ్మద్​ ఖాన్​ కుయుక్తులు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ భూములు గతంలో షా అమీనుద్దీన్​ దర్గాకు సంబంధించినవని నోటీసులు అందాయని అన్నారు. తహశీల్దార్​ పాత ప్రభుత్వ రికార్డులను చూపి ఆ భూములు వక్ఫ్​ బోర్డుకు చెందినవని ప్రకటించారు. ఈ నెల మొదట్లో రాష్ర్ట గృహ నిర్మాణ, వక్ఫ్​, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్​ అహ్మద్​ ఖాన్​ వక్ఫ్​ అధికారులతో సమావేశం నిర్వహించారు. వక్ఫ్​ భూముల ఆక్రమణలపై చర్చ జరిగింది. ఈ చర్చల అనంతరమే ఈ భూములపై వివాదం చెలరిగింది. అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు కూడా ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో వెనుదిరిగిన అధికారులు మరోమారు వక్ఫ్​ పేరిట రైతులకు నోటీసులు జారీ చేశారు. 
 
41మందికి నోటీసులు..
హోన్వాడ గ్రామంలో 41 మంది రైతులకు 1974 గెజిట్​ ఆధారంగా నోటీసులు పంపారు. ఈ భూమి వక్ఫ్​ ఆస్తిగా ప్రభుత్వం పేర్కొన్నారు. ఒకవేళ రైతుల వద్ద ఆధారాలుంటే వాటికి సంబంధించిన పత్రాలు సమర్పించాలన్నారు. రైతుల వద్ద సరైన ఆధారాలుంటే వక్ఫ్​ బోర్డు చర్యలు తీసుకోదు. లేకుంటే చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
బీజేపీ మండిపాటు
రైతులను వక్ఫ్​ భూమి పేరిట నోటీసులు అందజేసి భయబ్రాంతులకు గురి చేయడంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మండిపడ్డారు. ఒక మతాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్​ ఆ భూములను వక్​ప్​ భూములుగా పేర్కొంటూ వారికి అప్పగించేందుకు పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో రైతుల పక్షాన నిలబడతామని తేజస్వి సూర్య స్పష్టం చేశారు. 
 
అంగుళం భూమి వదలబోం రైతులు..
భూములను వక్క్ఫ్​ విగా పేర్కొంటూ లాక్కోవాలని చూస్తున్నారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ఈ చర్యలు దిగితే రైతులు విషం తాగడం తప్ప మరో మార్గం లేదన్నారు. తమ భూములు పోతే తిండిగింజల కోసం కూడా అడుక్కునే పరిస్థితులు తలెత్తుతాయని, తమ భార్య పిల్లలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలో అంగుళం భూమి తీసుకున్నా జిల్లా మేజిస్ర్టేట్​ కార్యాలయం బయటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు రుణాల కోసం బ్యాంకుకు వెళితే బ్యాంకు అధికారులు కూడా వక్ఫ్​ బోర్డు నుంచి ఎన్​ వోసీ తేవాలని తిరకాసు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు దోపిడీ ప్రభుత్వమని మండిపడ్డారు.