జమ్మూకశ్మీర్ ఎన్నికలకు 95వేలమంది జవాన్లతో భద్రత!
Security for Jammu and Kashmir elections with 95 thousand soldiers!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తుకు ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కనివినీ ఎరుగని రీతిలో హింసకు, ఆందోళనలకు తావీయకూడదనే ఉద్దేశ్యంతో ఏకంగా 95వేల మంది సైనికులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు గురువారం తెలిపారు.
కశ్మీర్ లో 500 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించనున్నామన్నారు. జమ్మూలో 450 కంపెనీల సైన్యాన్ని మోహరించనున్నామన్నారు. వీరు గాక పోలీసులు కూడా విధుల్లో ఉంటారని తెలిపారు. అమర నాథ్ యాత్ర కోసం పహారా అందిస్తున్న బలగాలకు అదనంగా మరో 450 కంపెనీలను రప్పించనున్నామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సంయుక్త కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
ఉగ్రదాడి ఘటనల దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు పకడ్బందీగా ఏర్పాట్లకు సిద్ధమయ్యాయి.