సందేశ్ ఖాళీ.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సందేశ్​ఖాళీ ఘటనపై టీఎంసీ మమత ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Apr 4, 2024 - 19:00
 0
సందేశ్ ఖాళీ.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కోల్​కతా: సందేశ్​ఖాళీ ఘటనపై టీఎంసీ మమత ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై దాఖలైన పిటిషన్​పై గురువారం విచారణ చేపట్టింది. పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించింది. అఫిడవిట్లో ఒక్కశాతం నిజమున్నా అది ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత అధికార పార్టీ, స్థానిక యంత్రాంగమే వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సందేశ్​ఖాళీ ఘటన అనంతరం నిందితుడు టీఎంసీ నాయకుడు షేక్​ షాజహాన్, అతని అనుచరులను ఒక్కరొక్కరుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 55 రోజుల తరువాత టీఎంసీ నాయకుడు కోర్టులో లొంగిపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. అప్పటివరకు అరెస్టు చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. సందేశ్​ఖాళీ బాధితురాలిలో ఒకరికి బసిర్​హట్​ స్థానం నుంచి బీజేపీ టికెట్​ కేటాయించిన విషయం తెలిసిందే.