తొలివిడత పోలింగ్​ పై ఓటర్ల ఆసక్తి

ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్​ నమోదు

Nov 13, 2024 - 13:00
 0
తొలివిడత పోలింగ్​ పై ఓటర్ల ఆసక్తి

రాంచీ: ఝార్ఖండ్​ అసెంబ్లీ తొలివిడత 15 జిల్లాల్లోని 43 స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం ఓటింగ్ నమోదైంది. కుంతీ జిల్లాలో గరిష్టంగా 34శాతం ఓట్లు పోలవగా, అత్యల్పంగా 24.17శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుంచే ఓటర్లు ఓటింగ్​ లో పాల్గొనేందుకు భారీ ఎత్తున కేంద్రాలకు తరలివచ్చారు. ఓట్లు వేసేందుకు నూతన ఓటర్లు ఆసక్తిని ప్రదర్శించారు. పలు ప్రాంతాల్లో ఓటింగ్​ వేగంగా కొనసాగుతుండగా, పలు ప్రాంతాల్లో ఓటింగ్​ మందగించింది. తొలి దశలో మాజీ సీఎం చంపాయ్ సోరెన్, ఆయన కుమారుడు బాబులాల్ సోరెన్, మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా, మధు కోడా భార్య గీతా కోడా, రఘువర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, మంత్రి మిథిలేష్ ఠాకూర్, మంత్రి రామేశ్వర్ ఒరాన్, రాంచీ. ఎమ్మెల్యే సీపీ సింగ్, జేఎంఎం రాజ్యసభ ఎంపీ మహువా మజీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాల్లో మిగిలిన 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.