దేశాభివృద్ధిలో కీలకం ఓటు

నాగ్‌పూర్ టౌన్​ హాల్​ లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గడ్కరీ

Apr 19, 2024 - 11:44
 0
దేశాభివృద్ధిలో కీలకం ఓటు

నాగ్‌పూర్: దేశ అభివృద్ధిలో ప్రజాస్వామ్యం కీలక భాగస్వామ్యం పోషిస్తుందని, అందుకే ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్ టౌన్ హాల్‌ లో కుటుంబంతో కలిసి గడ్కరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో నాగ్​ పూర్​ లో 65శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. ఈ సారి ఓటింగ్​ శాతాన్ని ఎలాగైనా పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.