పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
టీజీఎస్ పీడీసీఎల్ అధ్యక్షులు వేణు ఈనెల 26న కార్పొరేట్ ఆఫీస్ వద్ద మహా ధర్నా
నా తెలంగాణ, పాపన్నపేట: ఈ నెల 26న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ మింట్ కాంపౌండ్ టీజీఎస్ పీడీసీఎల్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు పీడీసీ ఎల్ వేణు తెలిపారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గడిచిన 3-4 సంవత్సరాలుగా అనేకసార్లు వినతులు అందించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కార్మికులు, ఆర్టిజన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అయినప్పటికీ విద్యుత్ సంస్థ ప్రయోజనాల దృష్ట్యా 1104 యూనియన్ అత్యంత ఓర్పు నేర్పుతో వ్యవహరిస్తుందని 1104 యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. పీఎన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రధాన సమస్యలన్నింటినీ సామరస్య పూర్వక వాతావరణంలో పారిశ్రామిక ప్రశాంతతను కాపాడుతూ ఈ నెల 25 వరకు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 26న కార్పొరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.