చెన్నైలో నీటి సంక్షోభం

ఎండిపోయిన వీరనాం చెరువు రోజురోజుకు అడుగంటుతోన్న భూగర్భ జలాలు డిమాండ్​ 2232 ఎంఎల్​ డీ, అందిస్తోంది 1070 ఎంఎల్​ డీ మాత్రమే ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్​ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం

Apr 11, 2024 - 14:57
 0
చెన్నైలో నీటి సంక్షోభం

చెన్నై:బెంగళూరుతోపాటు ప్రస్తుతం నీటి సంక్షోంభం చెన్నైలో కూడా తలెత్తింది. 43 శాతం జనాభా దాహార్తిని తీసే చెరువు వీరనాం ఎండిపోయింది. చెరువులో కొన్ని నీరు మాత్రమే మిగలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. గత జూలైలో కూడా ఇటువంటి పరిస్థితులే తలెత్తినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారానికి ఈ సరస్సులో అతి కొద్ది నీరు మిగలడంతో మూడు, నాలుగు రోజుల తరువాత చెరువు పూర్తిగా ఎండిపోవడం ఖాయమని అధికారులు తెలిపారు. చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రకారం గత సంవత్సరం ఇదే సమయానికి సరస్సులో 773.95 మిలియన్ క్యూబిక్ అడుగుల (ఎంసీఎఫ్​టీ) నీరు ఉందని తెలిపారు. కాగా చెరువు పూర్తి సామర్థ్యం 1465 ఎంసీఎఫ్​టీ.

సముద్రపు నీరు అందించేందుకు ప్రయత్నం..

కాగా నగరానికి నీరందించే ఇతర చెరువులు, ప్రాజెక్టుల పరిస్థితుల్లో కూడా నీరు ఇంకిపోతుండడంతో తాగునీటికి కష్టాలు తప్పేట్లుగా లేవు. అయితే సముద్రపు నీటిని శుద్ధి చేసి త్రాగడానికి యోగ్యంగా మార్చి ప్రజలకు అందించే ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 
మరోవైపు భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి.